Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు.. మన మన బడి కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం లింగగిరి ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల మన ఊరు- మన బడి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు.అదనపు తరగతిగదుల నిర్మాణం అవసరమైన ఫర్నీచర్ కొనుగోలు, మరుగుదొడ్లతో పాటు మెరుగైన విద్యుత్ మరియు డైనింగ్ హాళ్లు, డిజిటల్ తరగతి గదులకు పరికరాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు పూర్తి చేసుకొని కార్పోరేట్ పాఠశాలను దీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గెల్లి రవి మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ కడియం వెంకట్రెడ్డి, సర్పంచ్ అంజిరెడ్డి, ఎంపీటీసీ వల్లభనేని విజయలక్ష్మీ,ఎస్ఎంసీ చైర్మెన్ వీరబాబు, హెడ్మాస్టర్ సాముల వెంకట్రెడ్డి, గాయం ధనలక్ష్మీ, ఇందిరాల జ్యోతి, ఉపసర్పంచ్ రమా పాల్గొన్నారు.