Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
టీయూడబ్ల్యూజే 143 యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇండ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలు నాయకులు జర్నలిస్టులను తమ అవసరాలకు వాడుకుని వదిలేశారన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రభుత్వం జర్నలిస్టుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు త్రిపుర రమేష్‌రెడ్డి, నాయకులు ధూళిపాల శ్రీనివాస్,క్రాంతి,త్రిపురం నర్సింహారెడ్డి, ప్రెస్‌క్లబ్ నియోజకవర్గ అధ్యక్షుడు దుగి ఉషశ్రీ, తండ వెంకన్న, బైరిబాలు ,మహేశ్, నాగేశ్వర్రావు, పండ్ల నాగరాజు, లక్ష్మణ్, నరేష్, శివ, గోపిరెడ్డి, అశ్విని, శివ, భిక్షం, నరేందర్,రాజు, సైదా, జాని, నాగరాజు, నరేష్‌రెడ్డి, రవీందర్, మధు, ప్రవీణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.