Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నార్కట్‌పల్లి గ్రంథాలయ అభివృద్ధికి కృషి చెయ్యనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయాన్ని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి నిధుల నుండి మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గ్రంథాలయ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని, గ్రంధాలఅభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎంపీపీ సూది నరేందర్‌రెడ్డికి గ్రంథాలయ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు దుబ్బాక పావని శ్రీధర్ యాదవ్, పుల్లెంల ముత్తయ్య, సర్పంచులు అలుగుబెల్లి సత్తిరెడ్డి, ఇందిరా, కొత్త నరసింహ, కోపుల్ల రాంరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు దోసపాటి విష్ణుమూర్తి పాల్గొన్నారు.