Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ కిసాన్ సిల్ జిల్లా అధ్యక్షులు నర్సిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని అవంతిపురం మార్కెట్ యార్డ్‌లో ఉన్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు వరికుప్పలు మొత్తం కూడా తడిసి మొలకలు ఎత్తి రైతన్నలు అంతా కూడా గోడు వెలబోసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందన్నారు. వర్షాలు వస్తున్నట్టు ముందస్తుగా తెలుస్తున్నప్పటి కూడా వరికుప్పలకు ప్రభుత్వం తార్పల్లిలో ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే తడిసిన ధాన్యానికి కాంటాలు వేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనక పోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తలకొప్పుల సైదులు, పొలగాని వెంకటేష్‌గౌడ్, మండల మైనార్టీ అధ్యక్షులు మహమూద్గౌస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, అజయ్, శ్రీనివాస్, రవి, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.