Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నకిరేకల్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పధకాలు సమర్ధంగా అమలు చేస్తున్నందునే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వార్డు మెంబెర్ కుంచం అలివేలు సైదులు, బండారు ప్రవీణ్ కుమార్, కొమ్మనబోయిన శంకర్, కొమ్మనబోయిన జానయ్య, జాజుల శ్రీను, కాపర్తి ప్రసాద్, చెట్టుపల్లి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, సర్పంచ్ చెట్టుపల్లి జానయ్య పాల్గొన్నారు.
అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించండి
నకిరేకల్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు స్థానికులు, వ్యాపారస్తులు సంపూర్ణ సహకారం అందించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో రూ.26 కోట్లతో సాగుతున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల దృష్ట్యా రోడ్డు మధ్యలో నుంచి 50 ఫీట్ల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టామన్నారు. రోడ్లపైకి ఉన్న నిర్మాణాలు, దుకాణాలు ఇళ్ల స్లాబుల ముందు భాగాలు తొలగింపు ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.