Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు
నవతెలంగాణ-కేతపల్లి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలని సీపీిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కేతపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న పంచాయతీ కార్యదర్శుల శాంతియుత నిరాహార దీక్షను సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చిన్న వెంకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాలలో ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కారించడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారని వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ (ఎం) కేతపల్లి మండల కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య, పంచాయతీ కార్యదర్శులు పరమేష్, కృష్ణయ్య, నాగార్జున, హరీష్, సంతోష్, ప్రవీణ్, సైదులు, రాంప్రసాద్, రాధిక, విజయ, నాగమణి పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ ఎంపీడీవో కార్యాలయం ముందు జరుగుతున్న పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగింది. సమ్మె శిబిరానికి హాజరై వారు మద్దతు ప్రకటించి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శుల సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించి సమ్మె విరివింపజేయాలని , లేనిపక్షంలో పంచాయతీ కార్యదర్శులకు అండగా ప్రజలను సమీకరించి సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుజిత, అజయ్, వెంకన్న, రాజశేఖర్, జానకి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : 2019 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులు రెగ్యులర్ చేసి పే స్కేల్ అందజేయాలని ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద చేపట్టిన శాంతియుత నిరావధిక సమ్మె మంగళవారం ఐదో రోజుకు చేరింది. ఈ సమ్మెకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినీది దుర్గ ప్రసాద్ సంఘీభావాన్ని ప్రకటించి మాట్లాడారు. ప్రోబేషనరీ పిరియడ్ మూడు సంవత్సరాలు మాత్రమే అని నియామకపు నోటిఫికేషన్లో పేర్కొని మరో సంవత్సరం పొడిగించి నేటి వరకు రెగ్యులర్ చేయకపోవడం విచారకరమన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో చేపట్టిన సమ్మె మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సమ్మె శిబిరాన్ని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్కట్‌పల్లి సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకటేశం, ఔరవాణి గ్రామ సర్పంచ్ మాధగోని అండాలు నరసింహగౌడ్, చౌడంపల్లి సర్పంచ్ దుబ్బ మధు, చిన్నారాయణపురం సర్పంచ్ కొత్త నరసింహ, దాసరి గూడెం సర్పంచ్ ఉప్పుల అనంతలక్ష్మి రామ్‌రెడ్డి, షేరు బావిగూడెం సర్పంచ్ ఇందిరా సత్తిరెడ్డి, కాలం సుభాష్‌రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ నీరుడు షణ్ముఖరెడ్డి హాజరై వారికి సంఘీభావం తెలిపారు.
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతి సెక్రటరీలను తక్షణమే క్రమబద్దీకరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు కెేవీపీఎస్, విద్యావంతుల వేదిక, టిపివైఎస్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాలడగు నాగార్జున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అద్యక్షులు పందుల సైదులు, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నలుపరాజు సైదులు, కోట్ల అశోక్‌రెడ్డి, రాజశేఖర్, ప్రవీణ్, వెంకన్న, సుజిత్, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.