Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్లకు, రైతులకు వాగ్వివాదం
కోదాడరూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షం కారణంతో ఒకపక్క ఇబ్బందులు పడుతుంటే తరుగు పేరుతో రైతులను మరోపక్క మిల్లర్లు దోచుకుంటున్నారు.తమ్మర గ్రామ శివారులో ఉన్న ఓ మిల్లులో అనంతగిరి మండలం మొగలాయకోట గ్రామానికి చెందిన విక్రమ్ అను రైతు తాను పండించిన పంటను తీసుకొచ్చాడు.ఆ మిల్లు యాజమాన్యం మూడు కేజీల తరుగు ఇవ్వాలంటూ అనడంతో బాధపడుతూ ధాన్యం కొనుగోలుకేంద్రాల నుండి తీసుకువచ్చిన ధాన్యాన్ని ఏ విధంగా తరుగు తీస్తారని, నా ధాన్యం తడవలేదని, మంచిగా ఉన్న ధాన్యానికి ఏ విధంగా తరుగు తీస్తారని ప్రశ్నించాడు. గమనించిన మాజీ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంపటి మధు ఆ మిల్లు యాజమాన్యం రైతులపై వాగ్వివాదానికి దిగారు.అసలు మీ బండ్లు మొత్తం తీసుకుని వెళ్ళండంటూ అహంకారపూరితంగా మాట్లాడారు.మీకు రూల్స్ తెలుసా కేసీఆర్ ఏ రూల్స్ పెట్టాడో తెలుసా అని రైతులను భయభ్రాంతులకు గురి చేశారు.దీనిపై అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని మిల్లుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.