Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని,ఆలయాలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం నేరేడుచర్ల మండలంలోని ఫత్తేపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి - రజిత దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే దేవాలయాల అభివద్ధి జరుగుతున్నాయన్నారు.గ్రామ ప్రజలు కూడా ఆలయాలకు దానధర్మాలు చేయడం మహాభాగ్యం అన్నారు.ఆలయాలు సంస్కతి సంప్రదాయాలకు నిలయాలని,సమాజంలో మానవ సంబంధాలు నైతిక విలువలు ఆలయాల పరిరక్షణతోనే పెంపొందుతాయన్నారు.ఆధ్యాత్మికతతో మానసికప్రశాంతత లభిస్తుందన్నారు.అనంతరం దేవాలయం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్‌బాబు, చింతకుంట్ల సోమిరెడ్డి, ఎంపీపీ లకుమల జ్యోతి, జెడ్పీటీసీ రాపోలునర్సయ్య, వైస్‌ఎంపీపీ తాలూరి లక్ష్మీనారాయణ, చిల్లపల్లి పీఏసీఎస్ చైర్మెన్ అనంత శ్రీనివాస్‌గౌడ్, దొండపాటి అప్పిరెడ్డి స్థానిక సర్పంచ్ పల్లెపంగ నాగరాజు ఎంపీటీసీ నాగవేణి గురువయ్య, మేడారం ఎంపీటీసీ మండల రాజేష్, చిట్యాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.