Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పులిచింతల ప్రాజెక్టు పూర్తయి దాదాపు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ముంపు గ్రామాలైన వదినేపల్లి, బుగ్గ మాదారం, వెల్లటూరు, కిస్టాపురం, రేపల్లె, తమ్మారం, చింతిరియాల, నెమలిపురి, వెల్లటూరు ఆయా గ్రామాలలో సమస్యలు పూర్తిగా పరిష్కరింపబడలేదని ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాలలో కొంతమందికి ఇండ్ల స్థలాలు కేటాయింపు జరగలేదని మరికొంతమంది భూములకు నష్టపరిహారం అందలేదన్నారు. అదేవిధంగా గ్రామాలలో ఇండ్ల స్థలాల కేటాయింపు మౌలిక వసతుల కలపన వంటి సమస్యలు ఇంకా ఉన్నాయని చెప్పారు. ఎల్లప్పుడూ కేటాయింపు దేవాలయాల నిర్మాణం బారియల్ గ్రౌండ్స్ ఏర్పాటు ముంపు గ్రామాల ప్రజలు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు వాళ్ల సమస్యల పరిష్కరించాలన్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక ప్రత్యేక అధికారిని నియమించి నివేదిక తయారు చేయించి వారికి అన్ని రకాలైన పరిహారం అందేలా చూడాల న్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు సమస్యలను వివరించారు. ఆర్డీఓ వెంకరెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఆయా గ్రామాల ప్రజలకు అందిన పరిహారం గురించి తెలియజేస్తూ ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిచింతల నేటిపారుదల శాఖ ఈడీఈలు, నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల ఎమ్మార్వోలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.