Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి.బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి నర్సింహులగూడెం ఐకేపీసెంటర్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది.భారీగా కురిసిన వర్షానికి ఐకేపీసెంటర్లో వడ్ల రాసులు నీటిలో మునిగిపోయాయి.వేలాది బస్తాల ధాన్యం నీటి పాలైంది.గత వా రం రోజులుగా వానలు వెంటాడటంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యం మొక్కలు వస్తున్నాయ ని రైతులు బావురుమంటున్నారు.ఐకేపీసెంటర్లో ధాన్యం కాంటాలు సక్రమంగా జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.సకాలంలో తూకాలు వేయకపోవ డంతో తాము నష్టాల పాలౌతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.త్వరితగతిన కాంటాలు వేసి తమ వెతలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.