Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర అద్యక్షులు నాగయ్య
నవతెలంగాణ-మునగాల
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ.నాగయ్య విమర్శించారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో సుందరయ్య భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని చెప్పారు. చట్టం స్ఫూర్తికే విరుద్ధంగా నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలకు అప్పనంగా ఇస్తుందని విమర్శించారు. పేదలకు 60 గజాల ఇంటి స్దలం ఇవ్వడానికి మాత్రం చేతులు రావడంలేదని చెప్పారు. ప్రధానమంత్రి ఆ వాస్ యోజన కింద సంవత్సరానికి రెండు కోట్లు ఇండ్లు కట్టి పేదలకు ఇస్తామని చెప్పిన హామీ ఎమైందని ప్రశ్నించారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం గ్రామీణ ఉపాధి హామీ చట్టాలను అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం తొక్కి పట్టిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పోడు, సాగు దారులుగా ఉన్న ఆదివాసి గిరిజనులకు ఇతర పేదలకు భూమిపై హక్కు ప త్రాలు ఇవ్వటం లేదన్నారు. కార్పొరేట్ బహుళ కంపెనీలకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో అడవులు పెం చడం పేరుతో విలువైన అటవీ భూము లు ఇతర సంపదను కట్ట పెట్టాలని చూ స్తుందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ ని ధులను గత సంవత్సరం కేటాయించిన లక్ష కోట్ల నుండి 60 వేలకోట్లకు బడ్జెట్ కుదించిందని చెప్పారు. ఉపాధి కూలి రోజుకు 600 గా పెంచి 200 రోజులు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలందరికి జీవో నెంబర్ 58, 59 ప్రకారం రెగ్యులర్ చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను తక్షణమే ఇవ్వాలని డి మాండ్ చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, వెలిది పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీను, పఠాన్ మహబూబ్ అలీ, నారసాని వెంకటేశ్వర్లు, సోమపంగు జానయ్య, కడెం కుమార్, జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర రామ్ చరణ్, బుడిగ ధనుంజయ్ గౌడ్ ,షేక్ సైదా హుస్సే న్, లింగయ్య ,వెంకన్న, పాల్గొన్నారు.