Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా రెండు పడకల గదుల సామూహిక గృహప్రవేశాలు
- లబ్దిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ
- మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి విలేకర్లూ తస్మాత్ జాగ్రత్త
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ప్రతి పేదవాడికి కల సొంత ఇంటి నిర్మాణం అని జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నక్కలపల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పూర్తి కావడంతో లబ్ధిదారులకు.ఇండ్ల పట్టాల పంపిణి, సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్‌రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 72 ఇండ్లకు గాను 64 ఇండ్లు పూర్తికాగా వాటిని డ్రా పద్ధతిన, అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలను అందించారు.
జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డికి సన్మానం
స్వంత గ్రామమైన నక్కలపల్లిలొ తాను 2 ఎకరాల భూమిని స్వంత డబ్బులతో కొనుగోలు చేసి కోటి యాభై లక్షలు విలువ గల 2 ఎకరాల భూమిని నిరుపేదల ఇంటి నిర్మాణానికి విరాళంగా యిచ్చిన జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శాలువాతో సత్కరించారు. ఇలాంటి గొప్ప మనస్సు గల నాయకులు కొద్ది మందే ఉంటారన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికల నెరవేరుస్తాం
జడ్పీ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి
కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకం చిర స్థాయిలో నిలిచేలా ఉన్నాయన్నారు. ఇలాంటి పేదల పక్షపాతి ప్రభుత్వానికి ఎల్లవేళలా ప్రజలు అండగా నిలవాలన్నారు. అసంపూర్తిగా వున్న 8ఇండ్లను త్వరలో పూర్తి చేయించి అర్హులైన వారికి అందిస్తామని తెలిపారు. అదే విదంగా మిగిలిన నిరుపేదలు ఎవరు భాధ పడవద్దని త్వరలో సొంత ఇంటి స్థలం కలవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 3లక్షల రూపాయలు అందిస్తుందని చెప్పారు. ఈ సందర్బంగా జిల్లా మంత్రివర్యులు జగదీశ్‌రెడ్డికి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి
విలేకరులు తస్మాత్ జాగ్రత్త
వాస్తవాస్తవాలను తెలుసుకోకుండా విలేకరులు పత్రికల్లో, చానల్లో ఏది పడితే అది రాయడం.. ప్రసారం చేయడము చేస్తున్నారని తమ పత్రికలు చానళ్లు ఉన్నాయని అనుకుంటే మా దగ్గర కూడా ఆ స్త్రాలు ఉన్నాయని, విలేకరులు తస్మాత్ జాగ్రత్త అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. తప్పుడు కథనాలు రాసేముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆత్మగౌరవం హుందాతనం దెబ్బతినకుండా వార్తలను రాయాలని సూచించారు. వాస్తవాలు రాయాలని ఆయన పేర్కొన్నారు.
జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నక్కలపల్లి గ్రామంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం జిల్లా పరిషత్ చైర్మెన్ తన స్వంత గ్రామమైన నక్కలపల్లిలొ తాను 2 ఎకరాల భూమిని స్వంత డబ్బులతో కొనుగోలు చేసి నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలని తన తల్లిదండ్రులు బండ చంద్రారెడ్డి -పిచ్చమ్మ జ్ఞాపకార్ధంగా విరాళంగా యిచ్చి, గృహాలను త్వరితగతిన పూర్తి చేయించి, లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి ,స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, మండల రైతు బందు అధ్యక్షులు యానాల అశోక్‌రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బండ జగన్మోహన్ రెడ్డి, నక్కలపల్లి గ్రామ సర్పంచ్ ఈద మాధవి నర్సింహా, ఉప సర్పంచ్ శ్రీపతి సైదులు, ఎంపీటీసీ కనుకు అంజయ్య, సావిత్రి కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ సత్తయ్య, సర్పంచులు బద్దం వరమ్మ రాంరెడ్డి, కర్నాటి ఉపేందర్, ఎడమ శేఖర్‌రెడ్డి, మండల ప్రచార కార్యదర్శి భాషపాక రవి కుమార్, హౌసింగ్ పిడి రాజ్ కుమార్, పంచాయతీ రాజ్ ఈఈ పతయ్య తహసిల్దార్ సైదుల ఎంపీడీవో యాదగిరి, వివిధ శాఖల మండల అధికారులు, వివిధ హౌదాలో వున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.