Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారం కోసం మహనీయులకు వినతి పత్రం
నవతెలంగాణ-చిట్యాలటౌన్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరుతూ గత వారం రోజులుగా వివిధ కోణాల్లో నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగా బుధవారం తమ డిమాండ్లను నెరవేర్చాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతీరావు ఫూలే, బాబుజగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : నల్లగొండ ఎండీఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సమ్మె బుధవారంతో ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేపీఎస్‌లు మాట్లాడారు. ఈ సమ్మెకు మద్దతుగా మండల జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, నల్లగొండ మండల అధ్యక్షులు మనమిద్ద సుమన్, జి చెన్నారం సర్పంచ్ ఉప్పునూతల వెంకన్నయాదవ్, ఎస్సీ, ఎస్టీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిక్షపతి, మల్లెపాక వెంకన్న, ఎమ్‌ఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నగేష్ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ :జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యనిర్వహక కార్యదర్శి దైద రవీందర్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దం విజరు, నాయకులు యం.డి యూసుఫ్ , చెనగోని రాజశేఖర్ గౌడ్ , వంటెపాక సతీష్ , చెరుపల్లి సైదులు , పశుపతి , నల్గొండ మహేష్ , పందిరి సతీష్ పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి: జూనియర్ పంచాయతి కార్యదర్శుల క్రమబద్దీకరణ కార్యాచరణలో బాగంగా నార్కట్‌పల్లి మండల జూనియర్ పంచాయితీ కార్యదర్శులు 6 వ రోజు సమ్మె బుధవారం కొనసాగింది. ఈ సమ్మెకు నార్కట్‌పల్లి మండల కారోబార్ల్ సంఘం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ల సంఘం అధ్యక్షుడు వర్రే నర్సింహ, ఉపాధ్యక్షులు సామ సునీత తదితర కారోబర్లు పాల్గొన్నారు.