Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తీగల మోహన్‌రావు
నవతెలంగాణ-నేరేడుచర్ల
లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల సేవల అమోఘమని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తీగల మోహన్‌రావు అన్నారు. బుధవారం నేరేడుచర్లలో అధికారిక సందర్శనలో భాగంగా నేరేడుచర్ల లయన్స్‌క్లబ్‌ను సందర్శించారు.పలు సేవా కార్యక్రమాలు నేరెడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.మొదటగా పెంచికల్ దిన్న గ్రామంలో నేరెడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణాకేంద్రాన్ని సందర్శించి 30 మంది పేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం క్లబ్ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం నేరేడుచర్ల నందు పర్యావవరణ హితమైన జూట్ బ్యాగులు పంపిణీ చేసి పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.తదనంతరం పేద మహిళలు భర్తలను కోల్పోయి కుటుంబ భారం మోస్తున్న ఇద్దరికి,క్లబ్ పూర్వాద్యక్షులు పోరెడ్డి శ్రీరాంరెడ్డి సౌజన్యంతో కుట్టుమిషన్లను పంపిణీ చేశారు.పేద అనాథవద్ద మహిళలకు బియ్యం సరుకులు పంపిణీ చేశారు.ఈసందర్భంగా నిర్వహి ంచిన సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా 214 దేశాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్ని వివరించారు. పేదలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరికి సంతప్తినిచ్చే అంశమన్నారు.లయనిజంలో చేరి సేవలందించాలని సూచించారు. క్లబ్లో చేరిన నూతన లయన్ సభ్యులు 10 మందికి లయన్స్ సభ్యత్వం ఇచ్చారు.సమాజ సేవలో నేరెడుచర్ల లయన్స్ క్లబ్ ముందుందని కొనియాడారు .ఇంటర్నేషనల్ మైల్ స్టోన్ అవార్డు పొందిన లయన్స్ క్లబ్ నేరేడుచర్లను అధ్యక్షుడు ఎడవల్లి సత్యనారాయణరెడ్డి మరియు సభ్యులను అభినందించారు. గత 2022- 23 జోన్ చైర్మెన్ బట్టు మధుకు బెస్ట్ జోన్ చైర్మెన్ అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు యడవల్లి సత్యనారాయణరెడ్డి, డిస్ట్రిక్ట్ కేబినేట్ సభ్యులు జెల్లా దశరథ, పూర్వాధ్యక్షులు కొణతం సీతారాంరెడ్డి, పోరెడ్డి శ్రీరాంరెడ్డి, సుంకరి క్రాంతికుమార్, బట్టుమధు, రాచకొండఅంజయ్య, కందిబండ శ్రీనివాసరావు, బాలెన సైదులు, ప్రధానకార్యదర్శి చల్లా ప్రభాకర్‌రెడ్డి, కోశాధికారి జిలకర రామస్వామి ,ఉపాధ్యక్షులు కర్రి సూర్యనారాయణరెడ్డి, రాచకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.