Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందనిబీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం అన్నారు. శుక్రవారం పట్టణకేంద్రంలోని 2, 3, 4, 5, 10, 12 వార్డులలో పీఏసీఎస్ వైస్ చైర్పర్సన్ చింతకింది చంద్రకళ,మురహరి తో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నార్ణు. బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 19 మందికి చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేష్, ఆలేరు మాజీ సర్పంచ్ చింతకింది మురళి,కౌన్సిలర్లు బేతి రాములు, కందుల శ్రీకాంత్, కోఆప్షన్ సీస రాజేష్ ,ఉపాధ్యక్షులు బీజని బాలరాజ్,మహిళా విభాగం అధ్యక్షురాలు సీస మహేశ్వరి, బింగి రవి, పట్టణ కార్యదర్శి పత్తి వెంకటేష్, అధికార ప్రతినిధి ముదిగొండ శ్రీకాంత్, దయ్యాల సంపత్, బింగి గణేష్, ఆలేట్ అనిల్, సీసా ప్రవీణ్ ,2 వ వార్డు అధ్యక్షులు కొండ చంద్రారెడ్డి, సీస సత్తయ్య, మెరుగు కృష్ణమూర్తి ,ఎర్ర దేవదానం, సంగి స్వామి, చిట్టి మిల్ల వెంకటేష్ ,దుడుక గణేష్, గట్టు శ్రీను టింకు బన్నీ ఆలేటి అరుణ పాల్గొన్నారు.