Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- రామన్నపేట
అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను, అమరవీరుల స్ఫూర్తిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ఆరోపించారు. శుక్రవారం మండలంలో రామన్నపేట, ఇస్కిళ్ళ, కక్కిరేణి, ఎన్నారం గ్రామాలలో బహిరంగ సభ జయప్రదం చేయాలని కార్మికులకు కలిసి కార్మిక గర్జన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ మేడే వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 7న భువనగిరిలో నిర్వహించే కార్మిక గర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలుగా మార్చుతూ నాలుగు లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, ప్రజాసంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కన్వీనర్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గొరిగెసోములు, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బందెల బిక్షం,హమాలీ సంఘం నాయకులు అంజయ్య, నరసింహ, ప్రజా సంఘాల నాయకులు వేముల సైదులు, నాయకులు నగేష్, గోరయ్య, గిరి పాల్గొన్నారు.