Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఉపాధి హామీలో వికలాంగులకు జాబ్ కార్డ్ ఇచ్చి పని కల్పించాలని, ఆసరా పెన్షన్ల మంజూరుకు ఆదాయ పరిమితి నిబంధన విధించే జీవో 17ను వెంటనే రద్దు చేయాలని, వికలాంగుల పెన్షన్ 10 వేలకు పెంచాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక దుంపల మల్లారెడ్డి భవన్లో జిల్లా అధ్యక్షులు సురపంగా ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 43.02 లక్షల మంది వికలాంగులు ఒక్కటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిగిన వారు ఉన్నారన్నారు. రాష్ట్ర జనాభాలో 12.02శాతం వికలాంగులు ఉన్నారని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా సంక్షేమ పథకాల్లో 12 శాతం వికలాంగులకు కేటాయించాలని, నామినేటెడ్ పదవులలో వికలాంగులకు రిజర్వేషన్స్ కలిపించెందుకు ప్రత్యేక చట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. వికలాంగుల కుటుంబాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలనీ అన్నారు .వైకల్య ధవీకరణ పత్రం కలిగిన వికలాంగులకు బస్సులు, రైల్వేలలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5లక్షలు నిర్మాణం కోసం ఇవ్వాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్,జిల్లా కోశాధికారి బి స్వామి, జిల్లా నాయకులు లలిత, అంజన్ శ్రీ, కొమురయ్య, ఇంజ పద్మ, రజిత, రుభేన్, మురళి, పద్మ, మనోహర, అంజయ్య, రాఘవులు, ఎల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ రెడ్డి పాల్గొన్నారు.