Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేటీబచావో అంటే ఇదేనా?
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
అంతర్జాతీయ వేదికలపై దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన రెజ్లర్లపై రాత్రిపూట ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని, జాతీయ క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గుచేటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సుందరయ్య భవన్లో జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ ఢిల్లీలో నాలుగు రోజులుగా భారీ వర్షాల్లో పడడంతో జంతర్‌మంతర్‌లో నడిరోడ్డుపై ఆందోళన కొనసాగిస్తున్న రెజ్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ పోలీసుల చర్యను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. దేశ ఆడబిడ్డలపై ఆకత్యాలకు పాల్పడడంలో బీజేపీ ఏమాత్రం వెనుకాడడం లేదన్నారు. యువతుల పట్ల ఢిల్లీ పోలీసులు అన్యాయంగా ప్రవర్తించిన తీరు బాధాకరం కలవరం కలిగిస్తుందన్నారు. ఆడబిడ్డల గౌరవ ,మర్యాదలను ఈ విధంగా మంట కలపడం సిగ్గుచేటన్నారు. నిరసనకారులను వేధించేబదులు నేరుగా హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు బీజేపీ, బీడబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షులు హర్యానాలోని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బ్రిషన్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. బేేటీ బచావో అంటే ఇదేనా అని ప్రశ్నించారు. దేశంలోని రెజ్లర్లు, రైతులు ,జర్నలిస్టులు, యువతను అరెస్టు చేయడం దేశంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుందన్నారు. అరెస్టు చేసిన వారిని ఢిల్లీ పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెజ్లర్లపై క్రూరమైన దాడి వారి నిరసనను విధ్వంసం చేసే కుట్రకు పరాకాష్ట అని అన్నారు. .ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు తమ పథకాలు, అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆలస్యం చేయకుండా బ్రష్ భూషణ్ శరన్ సింగ్‌ను కటకటాల వెనక్కి నెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటర్ బాలరాజు గౌడ్, కల్లూరు మల్లేశం, దాసరి పాండు, తదితరులు పాల్గొన్నారు.