Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్తీదవాఖాన మోడల్ మెగాపార్క్ ప్రారంభం
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.శుక్రవారం పట్టణంలోని 10వ,11వ వార్డుల్లో ప్రజల రాకపోకల సౌకర్యార్థం కాలువలపై రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కల్వర్ట్ బిడ్జిని, రూ.13 లక్షల వ్యయంతో బస్తీ దవాఖానను, 8వ వార్డులో రూ.1.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కోదాడ అర్బన్ మెగా పార్కును ఎమ్మెల్యే ప్రారంభించారు.బీఆర్ఎస్ నాయకులు మామిడి రామారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకతీతమైన అభివృద్ధినే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో పట్టణంలో సాగుతున్న అభివృద్ధి పనులలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.2018 కు ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజలందరికి ఉపయోగపడే విధంగా అర్బన్ మోడల్ పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన అన్నారు.పట్టణాలకు నూతన హంగులు వస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి- సంక్షేమ పథకాలను రెండు కండ్లలాగా చూస్తూ ముందుకెళ్తుందన్నారు.అనంతరం ఆయా వార్డులలోని కల్యాణలక్ష్మీ,షాదీముబారక్ లబ్దిదారులను శాలువాతో సత్కరించి చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్, ఆర్డీఓ కిషోర్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌శర్మ, కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యబాబు, ఆల్ఫాఫ్ హుస్సేన్, అనంత సైదయ్య,కౌన్సిలర్లు మామిడి పద్మావతి, రమణనాయక్, కందుల చంద్రశేఖర్, కోట మధు, షేక్ మదార్, సాదిక్, ఖజా, స్వామినాయక్, డాక్టర్ బ్రహ్మం, బెజవాడ శ్రవణ్, కట్టెపోయిన శ్రీనివాస్‌యాదవ్, గుండెలసూర్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు సంపేట ఉపేందర్,తుమ్మలపల్లి భాస్కర్, పసుపులేటి రామారావు, గంధంపాండు, నెమ్మాది దేవమణి, తాజ్, రహీం, బత్తులఉపేందర్, వంశీ, లక్ష్మీనారాయణ, అఖిల్, ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు నిరంజన్, కల్యాణ్‌చక్రవర్తి పాల్గొన్నారు.