Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
ఐకేపీ కేంద్రాల్లో రైతన్నను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొంటున్నామని చెప్తున్నా, ఆచరణలో మిల్లర్ల దోపిడికి బలి కాక తప్పడం లేదు.మండలంలోని శూన్యపహాడ్, జాన్పాడు గ్రామాల్లో ప్రభుత్వం ఐకేపీసెంటర్లను గత నెల 22న ప్రారంభించింది. దొడ్డురకం ధాన్యాన్ని పండించిన రైతాంగానికి మద్దతు ధర ఆచరణలో రావడంలేదని రైతులు వాపోతున్నారు.20 రోజులుగా కొంతమేర ధాన్యాన్ని అమ్మగలిగామని, లారీలు సమయానికి రాకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం రాశులు తడుస్తున్నాయని. అధికారులు తేమ, తాలు పేరుతో 40 కేజీల బస్తాకు అదనంగా మరో కేజీకి పైగా తూకం వేసుకుంటున్నారని వాపోతున్నారు.అయినా భరించి ఒడ్లు లారీలకు ఎత్తిన తర్వాత మిల్లర్లు, మడతపేచీలు పెట క్వింటాకు మరో మూడు నుండి నాలుగు కేజీలు కోతలు విధించి, దిగుమతి చేసుకుంటున్నారని కన్నీరు మున్నీర వుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం అందించే మద్దతు రేటులో క్వింటాల్‌కు ఆరు నుంచి ఏడు కేజీలు ( సుమారు 150 రూపాయలు ) నష్టపోతున్నామని మహిళ రైతు ఆవేదన వ్యక్తం చేసింది.శూన్యపహాడ్ ఐకేపీ కేంద్రంలో ఇంకా 8వేల బస్తాలు కాంటాలు కావాల్సి ఉంది. లారీలను సకాలంలో పంపించి కోతలు విధించకుండా తమ ధాన్యాన్ని కొనాలని, గిరిజన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
లారీల కొరత ఉంది
ఐకేపీ నిర్వాహులు-సాయి
లారీల కొరత బాగా ఉంది. మిల్లుల యజమానులు కొందరు తాము ధాన్యాన్ని ఐకేపీసెంటర్లో నిర్ధారణ చేసి పంపించినా, తరుగు తీస్తున్నారు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.