Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రియాంకగాంధీ వస్తున్న తరుణంలో సూర్యాపేట నియోజకవర్గంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి సూర్యాపేట నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణం చేసి,ప్రతి మండలంలో మండల అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి భారీ జనసమీకరణతో సభను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి కోరారు.శుక్రవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గ సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 8 న జరిగే నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు వేలాది మంది తరలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, యువజన కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షుడు బైరు శైలేందేర్గౌడ్,మండల అధ్యక్షులు కోతి గోపాల్‌రెడ్డి,తూముల సురేష్‌రావు,ధరావత్ వీరన్న నాయక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలగాని బాలుగౌడ్, జిల్లా కార్యదర్శి నాగుల వాసు, చెరుకురాము,సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగేళ్ళ కర్నాకర్‌రెడ్డి, ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు వల్దాసు శ్రీను,జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత పాల్గొన్నారు.
తుంగతుర్తి : కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్‌లో విద్యార్థి నిరుద్యోగ గర్జనకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ వస్తున్నారని, కార్యకర్తలు నిరుద్యోగులు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, ఎల్డీఎంఆర్సీ నియోజకవర్గ ఇన్చార్జి బాలలక్ష్మీ, నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండలపరిధిలోని కరివిరాల గ్రామంలో ఆ పార్టీ జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ బతుకులు ఆగమ్య గోచరంగా మారాయన్నారు. తూతూమంత్రంగా నోటిఫికేషన్లు విడుదల చేసి ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా ఫీజులను దండుకుంటున్నారని ఆరోపించారు.ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిరుద్యోగుల పక్షాన యువత తరపున కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు.తుంగతుర్తి నియో జకవర్గంలో పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్ముగాస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే తిరుమలగిరి మండలంలోని దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలఅధ్యక్షులు దొంగరి గోవర్దన్ , జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్‌రావు, మద్దిరాల మండల అధ్యక్షుడు ముక్కల అవిలమల్లు, తిరుమలగిరి మండల అధ్యక్షుడు ఎల్సోజ్ నరేష్, అర్వపల్లి మండల అధ్యక్షుడు మొరపాకసత్యం, అర్వపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగి శ్రీను, నూతనకల్ మండల అధ్యక్షులు నాగం సుధాకర్‌రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అఫీజ్‌ఖాన్, అన్నారం సర్పంచ్ మిట్టగడుపుల అనుఖ్, మద్దిరాల మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తుంగతుర్తి మండల ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రామడుగు నవీన్‌చారి, యువజన కాంగ్రెస్ నాయకులు పసుల అశోక్ యాదవ్, రావులపల్లి మాజీ ఎంపీటీసీ చింతకుంట్ల బాబు, సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు.