Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, పెన్పహాడ్ మండలం అనాజిపురం గ్రామ మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి కృష్ణారెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో కృష్ణారెడ్డి 32వ వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాజిపురం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్న ఆదిరెడ్డి కృష్ణారెడ్డిని ఆనాటి కసాయి కాంగ్రెస్ గూండాలు అతి కిరాతకంగా హత్య చేశారన్నారు. అనాజిపురం గ్రామంలో పేదలకు ఇండ్లు, స్థలాలు, పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.పేదలకు సాగు భూములు పంచాలని, చెరువులో ప్రజలందరికీ వాటా కల్పిం చాలని కోరారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం .రాంబాబు, చివ్వెంల మండల కార్యదర్శి బచ్చలకూర రామ్చరణ్, సీఐటీయూ పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య పాల్గొన్నారు.