Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-మునుగోడు
అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో తడిచిన ధాన్యంను ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని గూడపూర్, సింగారం, కచలాపురం, పలివెల గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం అకాల వర్షాల కారణంగా తడిసిన మొలకెత్తిన కలర్ మారిన ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు సమయంలో వేసే తూకాలంలో ప్రభుత్వం నిబంధనలను పాటించకుండా అదనపు తూకాలను వేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే గోన సంచులు పాతవి కాకుండా కొత్త గోన సంచులను తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీసుకున్న భూమి లీజు ఖర్చులను రైతుల వద్ద బస్తకు రూపాయి చొప్పున వసూలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సర్పంచ్, సీపీఐ(ఎం) మండల నాయకులు మిర్యాల వెంకన్న, మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, యాసరాని శ్రీను, వేముల లింగస్వామి, చివర్ల వీరమల్లు, సాగర్ల మల్లేష్, కొంక రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంకావాలి
చండూరు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సీపీఐ(ఎం) అంతంపేట గ్రామశాఖ సమావేశం టీ.సైదులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తెచ్చికార్పొరేట్ విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆ రోపించారు. మతోన్మాద విధానాలను పాఠ్యాంశాల్లో చెప్పించి స్వాతంత్ర పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేస్తుందని విమర్శించారు. దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో విఫలమైందని అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని రైతు వ్యతిరేక చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాద విధానాలఫై ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు యాదయ్య, శ్రీశైలం, నరసింహ, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.