Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-చండూరు
భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మోటార్ సైకిల్స్ ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త పోరాటం తప్పదని తేలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ అంతంపేట గ్రామ కమిటీ సమావేశం బీ. సైదులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వెల్ఫేర్ బోర్డు కార్డు ఉన్న కార్మికుల అందరికీ మోటార్ సైకిల్ ఇస్తామని ఆర్థిక మంత్రి టీ. హరీష్ రావు ప్రకటించారు. మే 1న లక్ష మోటార్ సైకిల్ ఇస్తామని కార్మిక శాఖ మంత్రి సిహెచ్.మల్లారెడ్డి కూడా ప్రకటించారు. 9 నెలలు గడిచిన నేటికి ఎలాంటి విధి విధానాలురూపొందించలేదని, వెంటనే మోటార్ సైకిల్స్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పె ండింగ్లో ఉన్న 54 వేల క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని డి మాండ్ చేశారు. ప్రమాద మరణాలు సహజ మరణాలు, వివాహ, ప్రసూతి కానుకలు ఇతర బెనిఫిట్స్కి ఇచ్చే నష్టపరిహారం పెంచాలని కోరారు. ఏ సమస్య పరిష్కరించాలని లేబర్ ఆఫీస్ కి వెళ్ళిన ఖాళీ పోస్టులు ఉన్నాయని పని భారం పెరిగిందని అధికారులు అంటున్నారని అందుకే ఖాళీగా ఉన్న ఏఎల్ఓ, ఏసీఎల్, డీసీఎల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం ప్రకారం కార్మికుల పేర్లు నమోదు చేయాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, నాయకులు గూడపు నరసింహ,ఎం యాదయ్య, సిహెచ్.కృష్ణయ్య, మాడుగుల యాదయ్య, రామచంద్రు, ఏ.కృష్ణయ్య, మహేష్, హనుమంత్, తదితరులు పాల్గొన్నారు.