Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
తెలంగాణ అమరుల త్యాగాలను ఉద్యమ ఆకాంక్షలకు వెన్నుపోటు పొడిచి ఆస్తుల సంపాదనకు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆస్తుల సంపాదనకు తెగబడ్డ టీఆర్ఎస్ ఉరఫ్ బీఆర్ఎస్ నాయకుల మోసాన్ని ఇంటింటికీ ప్రచారాం చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ పిలుపునిచ్చారు. శనివారం జూన్ నాల్గవ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర పార్టీ ప్లీనరీ విజయవంతం కోసం సూర్యాపేటలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా జనసమితి ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు.విద్యార్థి వీరకిశోరాల త్యాగాల రక్షణ కవచంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన అక్రమ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం అధికారాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు. కేవలం తన ఆర్థిక ప్రయోజనాల కొరకే ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో అడ్డగోలుగా డబ్బులు సంపాదించారన్నారు. తెలంగాణ వనరులను సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కార్పొరేట్ శక్తులకు చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జిల్లాలను అటు ఆంధ్ర ఇటు మహారాష్ట్రకు అప్పగిస్తూ తన రాజకీయపడ్డ కోసం బీఆర్ఎస్ పేరుతో దేశం మీద పడ్డాడని ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్, నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, మారబోయిన శ్రీధర్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాండ్ర మల్లయ్య,దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి జిల్లా శ్రీను, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, కిరణ్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మాలపల్లి శ్రీనివాస్,మహిళా జన సమితి జిల్లా కన్వీనర్ లక్ష్మి, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు బొమ్మగాని వినరుగౌడ్,బామరీశ్వర్సింగ్, పట్టణ అధ్యక్షులు బంధన్నాయక్,జిల్లా నాయకులు బొడ్డు శంకర్, బాలకృష్ణారెడ్డి,యాకుబ్‌రెడ్డి, హరీష్, నెమ్మాది చిన్నభిక్షం,తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి: బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే భరోసా సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ దాసరి శ్రీను పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో బీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకుపల్లి లక్ష్మణ్, కోటి తదితరులు పాల్గొన్నారు.