Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మర్ క్యాంప్ నిర్వహణపై అభినందనలు
- కలెక్టర్ వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.శనివారం జిల్లాకేంద్రంలోని ఇమాంపేట గురుకులంలో ఏప్రిల్ 22 నుండి మే 6 వరకు కొనసాగుతున్న సమ్మర్ స్పార్కిల్స్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.విద్యార్థుల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు.సమ్మర్ క్యాంపులలో చదువుతో పాటు పలు అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.పేద, బడుగు, బలహీన వర్గాల విద్యాభివద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గురుకులాల్లో పిల్లలు చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారన్నారు.గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్యర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9' కళాశాలలను ఎంపిక చేసి ఇచ్చిన శిక్షణ శిబిరం వలన విద్యార్థులలో అన్ని రంగాల అభివద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్ కొనియాడారు.సూర్యాపేటలో త్వరలో ప్రారంభమయ్యే నూతన కలెక్టరేట్ భవనాన్ని విద్యార్థులు అందరూ సందర్శించి అక్కడ జరిగే పాలనా సంబంధిత విషయాలను అలాగే ప్రజా వాణి కార్యక్రమాలను విద్యార్థులు పరిశీలించాలని ప్రోత్సహించారు.వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న తల్లిదండ్రులకు శిబిరం గురించి అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.విద్యార్థులను శిబిరానికి పంపినందుకు విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ అభినందించారు.ముందుగా ఈ శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న పలు అంశాలను కలెక్టర్కు వివరించారు.వారు రూపొందించిన చాట్స్ కలెక్టర్కు చూపించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సాంఘికసంక్షేమ కళాశాలల సమన్వయకర్త అరుణకుమారి, సూర్యాపేట బాలికల కళాశాల ప్రిన్సిపాల్ బి.ఝాన్సీరాణి ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.