Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య
నవతెలంగాణ-కోదాడరూరల్
అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో పెండింగ్‌లో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని బదిలీపై అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన కె.భవ్య తెలిపారు.అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోదాడ అడిషనల్ జడ్జిగా తన పరిధిలోని కేసులను త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు. న్యాయవాదులు, సిబ్బంది సహకారం తో విధులను నిర్వర్తించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జునరావు, ఉపాధ్యక్షుడు గాలి శ్రీనివాసనాయుడు, ప్రధాన కార్యదర్శి సాధు శరత్‌బాబు, కోశాధికారి జానిపాషా, క్రీడా కార్యదర్శి అర్వపల్లి పవన్, కార్యవర్గ సభ్యులు దొడ్డ శ్రీధర్, నాగరాజు, చలం, హేమలత, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.