Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్
మనఊరు-మన బడి పథకం కింద మంజూరైన పనులు వెంటనే పూర్తి చేయాలని మండల విద్యాధికారి ధారాసింగ్ తెలిపారు.శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.పాఠశాలలు పునర్ప్రారంభమయ్యే లోపు అన్ని పనులు పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులను అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.అధిక శాతం పాఠశాలలో ఎన్ఆర్ ఈజీఎస్ పనులు మరుగుదొడ్లు, ప్రహరీ లు, వంటగదుల పనులు మందకోడిగా జరుగు తున్నా యన్నారు.వాటిని సర్పంచుల సహాయంతో వెంటనే పూర్తి చేయాలన్నారు.ఆత్మకూర్ జెడ్పీఎచ్ఎస్, పీఎస్ పాఠశాలల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ మల్సూర్‌నాయక్, పంచాయతీరాజ్ ఏఈ బాబురావు, హెచ్ఎంలు శంకర్‌నాయక్,వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ ఫోరం మండల అధ్యక్షులు వరికుప్పల వెంకన్న, ఎస్ఎంసీ చైర్మెన్లు పాల్గొన్నారు.