Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
సిమెంట్ పరిశ్రమల కార్మికుల సమస్యలపై సీఐటీయూ అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను అన్నారు.మండలపరిధిలోని దొండపాడు గ్రామంలో ఆ సంఘం ఆధ్వర్యంలో జువారి సిమెంట్ క్లస్టర్ పరిశ్రమ కార్మికుల సంఘం సమావేశం నిర్వహించారు. అనంతరం సిమెంట్ క్లస్టర్ పరిశ్రమ కార్మికుల సంఘం కన్వీనర్ వటైపు సైదులు మాట్లాడారు.సిమెంట్ పరిశ్రమలో కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలివ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.సిమెంట్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో మేనేజ్మెంట్ విఫలమైందన్నారు.నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమల్లో కార్మికులు వేలాది మంది పనిచేస్తున్న కాంట్రాక్టర్ కనీస వేతనం అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు.హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఐటీయూ సిమెంటు క్లస్టర్ పరిశ్రమ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో రానున్న కాలంలో కార్మిక సమస్యలపై పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గౌరవ అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వటైపు సైదులు, గౌరవ సలహాదారులు అన్నపురెడ్డి సీతారాంరెడ్డి, కమల్, బాబు, వెంకయ్య, అధ్యక్షులు ఎర్రపాటి రవి, ఉపాధ్యక్షులు శౌరి, ప్రధాన కార్యదర్శి నేరెడ్ల శీను, సహాయ కార్యదర్శి ఉప్పల భాగ్యరాజు, కోశాధికారి గురవయ్య, వెంకయ్య, కమిటీ సభ్యులు వెంకమ్మ, గిరి, బి.యాకోబ్, యూ.రవి, టి.వీరయ్య, కె.నర్సింహారావు, కె.శ్రీను, చారి, తదితరులు పాల్గొన్నారు.