Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వెంకట్రావు
నవతెలంగాణ-ఆత్మకూర్ఎస్
ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో లారీలు అందుబాటులో లేనప్పుడు ట్రాక్టర్లతో లోకల్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.శనివారం ఆత్మకూరుఎస్ మండలకేంద్రంలోని పీఏసీఎస్, దాచారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని పొలాల వద్దనే ఆరబెట్టుకుని తూర్పారబట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు.వర్షాలకు దాన్యం కొంత తేమ పెరగడంతో ఆరబెట్టిన తర్వాత వెంటనే కాంటాలు వేసి మిల్లుల కు తరలించాలని సూచించారు.మ్యాశ్చర్ వచ్చి కాంటాలైనప్పటికీ లారీలు సరిగా రావడం లేదని రైతులు, కేంద్ర నిర్వాహకులు కలెక్టర్కు తెలిపారు.వెంటనే లారీ, కాంట్రాక్టర్స్, ఆర్డీఓతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు.కొనుగోలుకేంద్రాలకు లారీలను సకాలంలో పంపించి ధాన్యం తరలించాలన్నారు.లారీలు అందుబాటులో లేని కొనుగోలు కేంద్రం రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం ఏరియాలో ధాన్యాన్ని కుండలు, మానుకలు, తవ్వల పేరుతో కొలుస్తారని గుర్తు చేశారు.ఇక్కడ ఆ విధానం ఉన్నదా... కనుమరుగైందా అంటూ రైతులతో కాసేపు ముచ్చటించారు.దశాబ్ద కాలం వరకు గ్రామీణ ప్రాంతాల్లో మానుకలు, తవ్వలు, సోలలు, గిద్దెలు లాంటి కొలమానికలు ఉండేవని ప్రస్తుతానికి అక్కడక్కడ కుండలతో వేరుశనగ, పెసల్లు, కందులు కొలుస్తుంటారని రైతులు కలెక్టర్కు వివరించారు.వ్యవసాయం, పంటపొలాల పరిస్థితులపై రైతులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు.ఆయన వెంట తహసీల్దార్ పుష్ప, ఏఓ దివ్య, ఆర్ఐలు అంజయ్య, రమేష్, ఏపీఎం మంజుల, సీఈఓ లక్ష్మారెడ్డి, శ్రీకాంత్, మల్లికార్జున్,రాము, అబ్బగాని భిక్షం, రైతులు ఉన్నారు.