Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య దళిత గిరిజన బీసీ సంఘాలు డిమాండ్
- బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు ధర్నా
నవతెలంగాణ-నల్లగొండ
పనిచేసిన జీతం అడిగిన దళిత కుటుంబం బొప్పని యాదగిరి అలివేలును కులం పేరుతో దూషించి దాడి చేసి కొట్టిన డీఈ మనోహర్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐక్య దళిత గిరిజన బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చి అనంతరం ఎన్జీ కాలేజీ ముందు ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. డీఈ మనోహర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు శాఖా పరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని, బాధితులకు ఇవ్వాల్సిన జీతం వెంటనే అందివ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇచ్చినప్పటికీ నాన్చుడు దోరానే మానుకోవాలని అన్నారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కులం పేరుతో దూషించారని, దరఖాస్తు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉండగా చేయకపోవడం అన్యాయమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయని యెడల పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయనున్నట్లు తెలిపారు. బాధితులకు జీతాలు ఇవ్వకుండా నానుస్తున్న ఎస్ఎల్బీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఎమ్మెస్పీ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్, జాతీయ మాల మహానాడు స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి బిక్షమయ్య, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన గౌడ్, సీనియర్ దళిత నాయకుడు ఒంటె పాక యాదగిరి, దళిత నాయకులు తెలగమల్ల యాదగిరి, అద్దంకి రవీందర్, రేఖల సైదులు ,బోగారి రామకృష్ణ, కొండ వెంకన్న, మేడి నరసింహ, బొల్లు రవీందర్, పోలే సత్యనారాయణ, మాసారపు వెంకన్న, బొజ్జ నాగరాజు, బాధితులు బొప్పని యాదగిరి అలివేలు తదితరులు పాల్గొన్నారు.