Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీరారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈనెల 8న హైదరాబాదులోని సరూర్నగర్లో జరిగే నిరుద్యోగ సంఘర్షణ ర్యాలీని జయప్రదం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పరిశీలకులు కుందూరు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రాజీవ్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఎంతోమంది నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారని పోటీ పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులు యువకులు మనోవేదన గురవుతున్నారని వాపోయారు. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, అందులో భాగంగా ఈనెల 8న నిరుద్యోగుల సంఘర్షణ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో నిరుద్యోగుల డిక్లరేషన్ రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో నుండి 3000 మంది నిరుద్యోగ యువకులు తగ్గకుండా అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. నల్లగొండలో జరిగిన నిరుద్యోగుల నిరసన దీక్షకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువకులు హాజరై విజయవంతం చేశారని అదే స్ఫూర్తితో హైదరాబాదులో జరిగే సంఘర్షణ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాంతరెడ్డి, బసవయ్య, ఎంఏ. సలీం, ఆరిఫ,్ మెరుగు శ్రీనివాస్, తలకొప్పుల సైదులు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ. గౌస్, యువజన కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్, బాల షాహిద్ తదితరులు పాల్గొన్నారు.