Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి
నవతెలంగాణ-మాడుగులపల్లి
తెలంగాణలో గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కన్నేకల్ గ్రామపంచాయతీ పరిధిలో సీడీపీ నిధుల ద్వారా పదిలక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మట్టి రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా శ్రీ పద్మనాభ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టిన పల్లె పకృతి వనం,డంపింగ్ యార్డ్, వైకుంఠ దామల వల్ల గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముఖ్య సలహాదారుడు పొకల రాజు, స్థానిక సర్పంచ్ సరిత వెంకన్న, ఎంపీటీసీ రజిత నరేందర్, గరకుంట పాలెం సర్పంచ్ విజయ లక్ష్మి శ్రీనివాస్‌రెడ్డి, ధర్మపురం చింతరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా జడ్పీ కో ఆప్షన్ మోషన్ అలీ, గుర్రంపోడు జడ్పీటిసి గాలి రవికుమార్ గౌడ్, వెనిగడ్ల పి.ఏ.సి.యస్ ఛైర్మన్ కెవి.రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మన్నెం రంజిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.