Authorization
Tue March 25, 2025 09:51:36 am
- అదనపు కలెక్టర్ భాస్కర్రావు
నవతెలంగాణ-నకిరేకల్
రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధాన్యాన్ని త్వరితగతిన కాంటాలు పెట్టాలన్నారు. కాంటాలు చేసిన ధాన్యాన్ని లారీలలోకి లోడ్ చేసి మిల్లర్లకు పంపించాలని సూచించారు. ఆయన వెంట తహసిల్దార్ ప్రసాద్, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు ఉన్నారు.