Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాన్ని దూరం చేసే ఆలోచనలు విరమించుకోవాలి
- భవిష్యత్తులో ఆందోళనలు ఉదృతం చేస్తాం
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నారిఐలయ్య
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఉపాధిహామీ పనులు చేసిన కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు, మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ పీడీ శైలజకు వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు చండూర్ మండలం దోనిపాముల గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తున్న సందర్భంలో చెరువులో జారీ పడి చంద్రమ్మ లక్మమ్మ అనే ఉపాధి కార్మికులు మరణించారని, నేటికీ వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని వెంటనే ఆర్థిక సహాయాన్ని అందజేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కట్టంగూర్ మండలం చేర్వుఅన్నారం గ్రామంలో దెందె మల్లయ్య అనే ఉపాధి కార్మికుడు పనిచేస్తున్న చోట ట్రాక్టర్ కాలుపై పోవడం వలన ప్రమాదం జరిగిందని వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న వేతనాలు సకాలంలో అందకపోవడం వలన కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. యూపీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి నాలుగు శాతం నిధులు కేటాయించిందని, 1.37 శాతం నిధులను కుదించిదని పలితంగా చేసిన పనులకు సకాలంలో వేతనాలు రాని పరిస్థితులు ఎర్పాడ్డాయని అందోళన వ్యక్తం చేశారు. ఉపాది చట్టాన్ని తీసివేసె కుట్రలో బాగంగా రెండు సార్లు హజరు వేసే విదానం తెచ్చి కార్మికులను చట్టానికి దూరం చేసే దుర్మార్గమైన ఆలోచనను కేంద్ర ప్రభుత్వ విరమించు కోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం రక్షణకై కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉచిత బీమా సౌకర్యం, ప్రమాదంలో చనిపోయిన కూలీలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో15శాతం నిధులు కేటాయించి 50 సంవత్సరాలు నిండిన కూలీల కు5వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బోజ్జ చినవెంకులు, జిల్లా ఆఫీస్ బేరర్స్ దండంపల్లి సరోజా, చింతపల్లి లూర్ధుమారయ్య, గండమల్ల రాములు, మన్నె బిక్షం, తదితరులు పాల్గొన్నారు.