Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మాడుగులపల్లి
తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని పాములపాడు గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం అకాల వర్షం కురవడం వలన రైతుల ధాన్యం బాగా తడవడంతో రైతులు నష్టపోతున్నారు. కాబట్టి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, అలాగే లారీల రవాణా సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రోజు ఇక్కడికి నాలుగు లేదా ఐదు లారీలు వస్తె బాగుంటదన్నారు. అలాగే అధికారులు చొరవ తీసుకోని ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సభ్యుడు డబ్బికర్ మల్లేశం, వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు పాల్వాయి రామ్‌రెడ్డి, నాగమ్మ, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రామచంద్ర, శ్రీను తదతరులు పాల్గొన్నారు.
మచ్చలేని మహా నాయకుడు మాలి
ద్వితీయ వర్థంతి సభలో జూలకంటి
వేములపల్లి : మచ్చలేని మహా నాయకుడు మాలి పురుషోత్తం రెడ్డి అని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మొలక పట్నం గ్రామంలో ఆయన ద్వితీయ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మాలి పురుషోత్తంరెడ్డి పార్టీకి ఎనలేనిసేవలు చేశారన్నారు. ఆయన విద్యార్థి దశ నుండి వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితుడై విద్యార్థి, యువజన సంఘాలకు నాయకత్వం వహించి ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. 1970 నుండి సీపీఐ(ఎం)లో చేరి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారన్నారు. రైతంగం ఎదుర్కొంటున్న విద్యుత్, లిఫ్టులు, మద్దతు ధర, కూలి రేట్లు తదితర సమస్యలపై పోరాటాలు చేసి సాధించారన్నారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ,ఆయన చూపిన మార్గంలో ప్రయాణించాలని అన్నారు . అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బింగ్ మల్లేష్, జిల్లా నాయకులు వీరే పల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, మల్లు గౌతమ్‌రెడ్డి, రోండి శ్రీనివాస్ ,పాదూరి గోవర్ధన శశిధర్ రెడ్డి, మంగారెడ్డి, అశోక్ రెడ్డి, పరశురాములు, బిక్షం, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.