Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి ప్యాకెట్ల ధర పెంపునకు నిర్ణయం
- గతంలో 450 గ్రాముల పత్తి ప్యాకెట్ ధర రూ.810
- ఇప్పుడు ఒక్కో ప్యాకెట్‌పై అదనంగా రూ.43 భారం పడే అవకాశం
- అయోమయంలో అన్నదాతల
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా చేయిస్తోంది. రైతన్న సంక్షేమం కోసం అనేక పథకాలు, ప్రోత్సాహకాలతో భరోసానిస్తున్నది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి, సాగు దం డుగ చేసేందుకు కంకణం కట్టుకున్నది. తాజాగా పత్తి రైతు నెత్తిన విత్తన భారం మోపేందుకు పావులు కదుపుతున్నది. విత్తన ప్యాకెట్లపై ధరల పెంపునకు గ్రీన్ సిగలిచ్చేయగా బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో రైతన్న బతుకు ఆగమయ్యే పరిస్థితి దాపురించింది. కేంద్రం లైన్ క్లియర్‌తో విత్తన కంపెనీలు ధరలు పెంచుకోనుండగా, ఒక్కో ప్యాకెట్‌కు రూ.43 నుంచి ఆ పైగా ధర చొప్పున పెరిగే అవకాశాలున్నాయి.
మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో యేటా పత్తి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలను రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం రైతు సాగుపై కక్ష కట్టినట్టే వ్యవహరిస్తోంది. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు పెంచుతూ పోతోంది. సబ్సిడీలు ఎత్తేస్తుండగా, రైతు పెట్టుబడి పెరిగిపోతోంది. దీంతో రైతు వ్యవసాయం భారంలా 'సాగు'తోంది. ఇదిలా ఉండగానే మూలిగే నక్కపై తాడి పండు పడ్డ చందంగా.. కేంద్రం పత్తి విత్తన ధరల పెంపునకు మరోసారి పచ్చజెండా ఊపింది. జిల్లాలో గత వానాకాలం 2021లో 6 లక్షల 40 వేలు ఎకరాలు, 2022లో 6 లక్షల47 వేలు ఎకరాల్లో పత్తి సాగైంది. ఏడాది వానాకాలంలో 6 లక్షల 50వేల ఎకరాల్లో రైతులు కాటన్ సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఎకరాకు రెండు ప్యాకెట్లు చొప్పున 48వేల ఎకరాల పత్తి సాగుకు 13 లక్షల పైచిలుకు విత్తన ప్యాకెట్లు అవసరం కానున్నాయి.
బీటీ-2 ప్యాకెట్ ధర రూ.43 పెంపు..
మన వద్ద బీటీ-1, బీటీ -2 విత్తనాలనే రైతులు వినియోగిస్తున్నారు. అయితే అధిక దిగుబడులు, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్న రైతాంగం బీటీ-2నే ఎక్కువగా వేస్తున్నది. ఇదే రకాన్ని వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు సాగుకు అనుకూలమని సూచిస్తున్నారు. ఇక బీటీ-2 విత్తనాలు 450గ్రాముల ప్యాకెట్ల రూపంలో కంపెనీలు మార్కెట్లో ఉంచుతున్నాయి. ఒక్కో ప్యాకెట్ 2020-21లో రూ.730, 2021-22లో రూ.767, అదే 2022-23లో రూ.810గా పెరిగింది. అయితే తాజాగా కేంద్రం నిర్ణయంతో ప్యాకెట్‌పై రూ.43 పెరుగనుంది. 2023-24 సీజన్ మరో రెండు నెలల్లోపు పత్తి పంట సీజన్ ప్రారంభం కానుండగా, అప్పుడు ఒక్కో ప్యాకెట్ రూ.853 ధరకు మార్కెట్లో దొరుకనుంది. జిల్లాలో 6 లక్షల 50వేల ఎకరాల్లో అంచనాలుండగా, ఒక్కో ప్యాకెట్‌పై రూ.43 పెరిగితే.. అన్నదాతలకు మరింత భారం భారం పడనుంది. యేటా దిగుబడులు తగ్గుతున్నాయని, పెట్టుబడులు పెరుగుతూ పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తన భారం వద్దంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బీటీ-2 ధరపై గెజిట్ వచ్చింది..
సుచరిత జిల్లా వ్యవసాయ అధికారిని
బీటీ-2 పత్తి ధరలపై కేంద్రం కమ్యూనికేట్ చేసింది. ఈ సీజన్లో అమలు చేస్తరు. గతంల బీటీ-2 ప్యాకెట్ 450 గ్రాముల ధర రూ.810గా ఉండే. ఇప్పుడు 43కు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగదలపై గె జిట్ కూడా వచ్చింది. రైతుల గమనించాలే. క్ర యవిక్రయాలపై నిఘా పెడ్తం. అధికారులు, శా స్త్రవేత్తల సలహాలు తీసుకుని సాగు చేసుకోవాలి.
విత్తనాలపై సబ్సిడీ ఇయ్యాలే..
కొండ వెంకన్న (రైతు కంచనపల్లి)
యేటా పత్తి ధరలు పెరుగుతున్నరు. బీటీ-2 ప్యాకెట్ ధర ఇప్పుడు రూ.43 పెరిగిందట. ఎట్లా..దున్నుకూళ్లు, కలుపు, ఎరువుల పెట్టుబడులు పెరిగినరు. రోగాలు అత్తనరు. దిగుబడి అత్తలేదు. నష్టపోతున్నం. రైతులను ఆదుకోవాలే. కేంద్రం సబ్సిడీలు ఇయ్యాలే. గిట్టుబాటు ధర పెరగాలే.