Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుర్కపల్లి
గిరిజన సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామ స్టేజి వద్ద 337.50 లక్షలతో బీటీ రోడ్డు ,మల్కాపూర్ గ్రామంలో 210 లక్షలతో బీటీ రోడ్డు పనులకు మంత్రి సత్యవతి రాథోడ్ ,ఆలేరు ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాదాపూర్ గ్రామంలోని పిఎన్ఆర్ గార్డెన్ లో గిరిజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుర్కపల్లి మండలం, బొమ్మలరామారం మండలానికి బీటీ రోడ్ల అవసరాల నిమిత్తం 11 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు .దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను దేశ ప్రజలు కావాలని కోరుకుంటున్నారన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళికలతో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతికి ముందు రెండు కోట్ల రూపాయలతో హైదరాబాదులో బంజారా భవన్‌ను నిర్మిస్తామన్నారు. గిరిజన ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. రెండు మండలాల్లో గిరిజనులు ఎక్కువ శాతం ఉంటారని ఎమ్మెల్యే తమ దృష్టికి తీసుకురావడంతో నిధులను కేటాయించినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి మరి మరో 10 కోట్ల వరకు నిధులు మంజూరు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజనులు అభివృద్ధి పథంలో నడవాలన్నారు .అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ,నియోజకవర్గ బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, తెలంగాణ ట్రైకర్ చైర్మెన్ ఇస్లావత్ రామచంద్రు నాయక్, మదర్ డెయిరీ చైర్మెన్‌్ శ్రీకర్ రెడ్డి, జెడ్పి వైస్ చైర్మెన్ ధనావత్ బిక్కు నాయక్, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ,రైతు బంధు మండల కన్వీనర్ కొమ్మిరి శెట్టి నరసింహులు, వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొండ్ర ముత్యాలు, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్ ,గిద్దె కరుణాకర్, కోమటిరెడ్డి సంతోష, సర్పంచులు పోగుల ఆంజనేయులు, ఇమ్మడి మల్లప్ప, అమలా బాలకృష్ణ, వెన్నుకుచి రామ్మోహన్ శర్మ ,నాగారం మహేందర్ ,కల్లూరి ప్రభాకర్ రెడ్డి, సురేష్, నాంసాని సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బోరెడ్డి రామిరెడ్డి, మాజీ సర్పంచ్ హరినాయక్, తదితరులు పాల్గొన్నారు.