Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం నాణ్యత ప్రమాణాలు లోపించడంతో స్లాబ్ పై పెంచు ఊడిపోయి, శిథిలావస్థకు చేరింది. ఆలేరు మండల రెవెన్యూ కార్యాలయం 2005 డిసెంబర్ 31వ తేదీన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టింది. గోడలు, స్లాబ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తో నిర్మాణం జరగాక , ఇసుక సిమెంటు ముడి సరుకులు సమపాళ్లలో లేకపోవడంతో వర్షానికి తడిసి పెచ్చులు ఊడిపోతుండడంతో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది బిక్కుబిక్కు మాంటు తమ విధి నిర్వహణ చేస్తున్నారు. నిత్యం మందులాదిమంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం తాసిల్దార్ కార్యాలయం వస్తుంటారు, ఉద్యోగులు సైతం పనులు,విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పెచ్చులుడుతున్న భవనాన్ని స్థానిక శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కలగజేసుకొని పునర్నిర్మించాలని, సుందరంగా తీర్చిదిద్దాలని రెవిన్యూ ఉద్యోగులు స్థానిక ప్రజలు కోరుతున్నారు
పెచ్చులు ఊడిపోతుండడంతో భయాందోళన
సీనియర్ అసిస్టెంట్ క్రీస్ట్
ఇటీవల కురుస్తున్న వర్షాలకు పెచ్చులు ఊడిపోతుండడంతో విధి నిర్వహణ చేస్తున్న క్రమంలో భయాందోళనగా ఉంది. గత రెండు సంవత్సరాల నుండి రెవిన్యూ కార్యాలయ భవనం , వర్షానికి తడిసి పెచ్చులు లోపల ఊడిపోతున్నాయి. గోడలు పగుళ్లు వచ్చాయి. ఎత్తం వచ్చే వారికి సైతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజా ప్రతినిధులు కలగజేసుకొని తహసీల్దార్ కార్యాలయం పునర్ నిర్మాణ పనులు చేపట్టి కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.