Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ మాజీ వైస్‌చైర్మెన్ గడ్డమీది పాండరిగౌడ్
నవతెలంగాణ-గుండాల
ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డితోనే సాధ్యమని,గత కొన్ని దశాబ్దాలుగా జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సునీత నాయకత్వంలోనే జరిగిందని జెడ్పీ మాజీ వైస్‌చైర్మెన్ గడ్డమీది పాండరిగౌడ్ అన్నారు.శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.ఎమ్మెల్యే సునీత మహేందర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి,ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజల్లో ఎంతో ఆదరణ పొందుతున్నారన్నారు.అది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తున్నారని,అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.ఎమ్మెల్యే సునీత గ్రామాల్లో అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీసీరోడ్లు,మురికి కాలువలతో పాటు ఇతర ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నారని,రెండుసార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గ రూపురేఖలు మార్చారన్నారు.ప్రజల మద్దతుతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు ఖాయం కావడంతో ఆమెను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు,ఓవర్గం మీడియా కుట్ర చేస్తున్నాయన్నారు.ప్రజలు,పార్టీ శ్రేణులు ఆ కుట్రలను తిప్పికొడతారన్నారు.ఎమ్మెల్యే సునీత మహేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని,నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడంతో సీఎం కేసీఆర్ వద్ద ఎమ్మెల్యేకు మంచి పేరు ఉందని,దాన్ని ఓర్వలేకనే ఎమ్మెల్యే పై ఇలాంటి కుట్రలకు దిగుతున్నారని విమర్శించారు.రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గొంగిడి సునీత హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు.