Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
తడిసి రంగు మారిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు.ఆదివారం నాడాయన మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలుకేంద్రాల్లో రైతులు పోసుకున్న వరిధాన్యం కుప్పలు అకాలవర్షానికి తడిసిపోతున్నాయన్నారు.అనేక ఇబ్బందులను తట్టుకొని పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు కొనుగోలుకేంద్రాల వద్ద తగినన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.అదనపుతూకం పేరుతో మోసాలకు పాల్పడితే సహించేది లేదన్నారు.ధాన్యం రాశులపై కప్పుకునేందుకు రైతులకు టార్ఫాలిన్లు పట్టాలు సరఫరా చేయాలన్నారు.తేమ శాతం లేదంటూ,తాలు పట్టాలంటూ ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు.వాతావరణం అనుకూలించనందున మ్యాచర్ 20,25 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తూకం వేయాలన్నారు.హమాలీల ఖర్చులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు భరించాలన్నారు.వరిధాన్యం తూకం వేసిన వారంలోగా రైతుల ధాన్యానికి చెల్లించాల్సిన డబ్బులు నేరుగా రైతు ఖాతాలోనే జమ చేయాలన్నారు.ఆయన వెంట రైతుసంఘం నాయకులు ఉడుత గాలయ్య,పీఏసీఎస్ డైరెక్టర్ చెరుకుపల్లి నర్సింహ, ముత్యాలు, నర్సింహ, గాలయ్య ఉన్నారు.