Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల
నవతెలంగాణ-కేతపల్లి
చికాగో అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోతామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల అన్నారు. కేతేపల్లి మండలంలోని చీకటిగూడెం గ్రామంలో మేడే దినోత్సవంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కందాల ప్రమీల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పనిదినం కోసం చికాగో అమరవీరులు చిందించిన రక్తంను స్ఫూర్తిగా తీసుకొని కార్మికుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, రైతు సంఘం జిల్లా నాయకులు కోట లింగయ్య, మండల కార్యదర్శి చింతపల్లి మారయ్య, నాయకులు సాధే నాగయ్య, ఏ.సుధీర్, తదితరులు పాల్గొన్నారు.