Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ప్రయివేట్ వైద్యులు పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇషా కంటి ఆస్పత్రిని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. వైద్యంతోపాటు కంటికి సంబంధించిన నాణ్యమైన పరికరాలు రోగులకు అందించాలని సూచించారు. డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, స్వాతి మాట్లాడుతూ నల్లగొండ ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిగా జిల్లా కేంద్రంలో నల్లగుడ్డు మార్పిడి చికిత్స ఆస్పత్రిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంజక్షన్ లేకుండా చుక్కల మందు వేసి కంటి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఆస్పత్రి నందు మూడు నెలలు ఉచిత ఓపీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, సీపీఐ(ఎం) నాయకులు సయ్యద్ హశం, పుచ్చకాయల నర్సిరెడ్డి, కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.