Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
తెలంగాణ రాష్ట్ర ఫకీర్ల కమ్యూనిటీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా భువనగిరి పట్టణానికి చెందిన షేక్ యాకూబ్ ఫకీర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ముస్లిం ఫకీర్ల కమ్యూనిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఆదివారం భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జాతీయ అధ్యక్షులు మహ్మద్ జాహంగీర్ పాషా ఫకీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఏడు లక్షలా ఎనబై వేలమందికి పైగా జనాభా కల్గిన ఫకీర్లను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఫకీర్లను ఓట్లకోసం మాత్రమే వాడుకొని, వదిలేస్తున్నారని ఆరోపించారు. ఫకీర్ల జీవితం సంచార జీవితం అని వారికి శాశ్వత జీవనవిధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారత దేశం గర్వించదగ్గ నాయకుడు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చిత్రపటాన్ని ఫకీర్ల ఇండ్లలో, బండ్ల మీద ఉండాలని ఆయన సూచించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ సలీం ఫకీర్, స్వచ్ఛంద సంస్థ నాయకులు కొడారి వెంకటేష్ పాల్గొన్నారు.