Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు,రాష్ట్ర అభివద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.సోమవారం చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలో సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి నరేంద్ర ప్రసాద్,ఉపసర్పంచ్ పెంటమల్ల జంగయ్య,వార్డు సభ్యులు పొలగోని అయోధ్య, కొన్రెడ్డి రాములు, చిలువేరు జంగయ్య,అనంతుల భాగ్యమ్మ,జడ సైదమ్మ, కృష్ణయ్య ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.బీఆర్ఎస్లో చేరిన నాయకులకు, కార్యకర్తలకు గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే తమ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్‌రెడ్డి,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ చింతపల్లి అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, రైతుబంధు మండలఅధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొపిడి కిష్టారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నట్వ గిరిధర్,బి.సి.సెల్ అధ్యక్షులు అండేకార్ అశోక్,ఎస్టీ సెల్ అధ్యక్షులు రమావత్ కొండల్నాయక్, మైనారిటీ అధ్యక్షులు చాంద్‌పాషా, ఎంపీటీసీ కుంభం శ్వేత శ్రీశైలంగౌడ్,బీఆర్ఎస్ నాయకులు మాసభాస్కర్, ఎల్లంకి అశోక్,ఉడుత అక్రంయాదవ్, అండేకార్ వెంకటేష్,నాదిరి రమేష్,నాదిరి శ్రీశైలం,దండేటికార్ ప్రసాద్,దండేటికార్ మోహన్, కేశగోని రవీందర్‌గౌడ్, కాయితి బచ్చిరెడ్డి,ఉలుపాల పురుషోత్తం రెడ్డి,బాదేపల్లి నీరంజన్, సిమర్ల శ్రీను యాదవ్,బాలగొని శ్రీను,ఆరెకంటి మురళి, పగడాల జంగయ్య, రమేష్‌నాయక్, కానందుల ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.