Authorization
Fri February 28, 2025 07:22:26 pm
నవతెలంగాణ-కేతపల్లి
ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు వెంటనే తరలించాలని జిల్లా వ్యవసాయ అధికారి , మండల ప్రత్యేక అధికారి వై సుచరిత అన్నారు. .మండల పరిధిలోని యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె తహశీల్దార్, వ్యవసాయ శాఖ, పిఎసిఎస్ ఐకెపి సిబ్బందితో కలిసి పరిశీలించారు. రైతులతో ధాన్యం కొనుగోలు జరుగుతున్నవిధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు తప్పనిసరిగా తమ ధాన్యాన్ని తాళు గింజలు లేకుండా శుభ్రం చేయాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే మిల్లులకు పంపించవలసిందిగా తెలిపారు. ఒకవేళ లారీల సమస్య ఉన్నట్లయితే ట్రాక్టర్ల ద్వారా కూడా కొన్న ధాన్యన్ని మిల్లులకు పంపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారి బి పురుషోత్తం, ఏఇఓ లు బాలరాజు వీరేష్ ఉమేష్ పాల్గొన్నారు.