Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే
- జేపీఎస్‌లకు సంపూర్ణ మద్దతు
- కేవీపీఎస్్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున,
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్గొండకలెక్టరేట్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో సకల పనులు చేయించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిపై కపట ప్రేమ చూపించడం తగదని, తక్షణమే క్రమబద్దీకరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సీఐటీయూ జిల్లా కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ జెపిఎస్‌లు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి 11వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కేవీపీఎస్, సీఐటీయూ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముగిసిన ప్రోహిబిషన్ పిరియడ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన జీవోకు కట్టుబడి వారిని క్రమబద్ధీకరించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తేడాలు చూపిస్తూ వివక్ష చూపడం ఎక్కడి న్యాయం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతేపాక వినోద్ కుమార్, జిల్లా నాయకులు ఎన్. నరసింహ ఎండి జహీర్, ఎం. రమేష్, రామలింగయ్య, పొట్టపంగి సైదులు,నాగయ్య, భాగ్యమ్మ, కార్యదర్శుల యూనియన్ నాయకులు కోడి రెక్క శైలజ, అశోక్, నరేష్ యాదవ్, షేక్ అసిఫ్, వెంకటేష్, ఝాన్సీ, ఉపేందర్, రాజశేఖర్, ప్రవీణ్, వెంకన్న, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.