Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాలటౌన్
పట్టణ కేంద్రంలో పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదవడానికి విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ డిమాండ్ చేశారు .గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం స్థలం సేకరించారని తెలిపారు. చెరుపల్లి సీతారాములు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కళాశాల ఏర్పాటు కోసం కమిటీ కూడా ఏర్పాటు చేసి కొంత ప్రయత్నం జరిగిందన్నారు.కానీ ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు సంబంధించి ఎటువంటి పనులు గాని చేయలేదన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐగా గతంలో అనేకసార్లు ఆందోళన నిర్వహించడం జరిగింది. దాని ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని కానీ ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడకపోవడం సరైనది కాదన్నారు వెంటనే ఎమ్మెల్యే స్పందించి చిట్యాల లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకులాలు ఏర్పాటు చేసి చిట్యాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆయన వెంట ఎస్ఎఫ్ఐ నాయకులు జిట్ట సురేష్ కూరాకుల బాలు జిట్ట గణేష్ ,బొలుగురి శ్యామ్ ,బరాల చరణ్ తదితరులు ఉన్నారు.