Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
రాష్ట్రంలోని పేద ప్రజలు ఆపత్కాలంలో ఉన్నపుడు ఆదుకునే ఆపద్బాంధవుడు సీఎం కెసిఆర్ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మంది లబ్దిదారులకు రూ.12 లక్షల 50 వేల రూపాయిల సిఎం సహాయ నిధి చెక్కులను మంజూరు చేయించి బాధిత కుటుంబాలకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలకు విలువిచ్చి వారి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఉండి వైద్య ఖర్చులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజల కోసం అండగా నిలుస్తానని పేర్కొన్నారు.
మిని స్టేడియం ను పరిశీలించిన చిరుమర్తి
నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మార్నింగ్ చేస్తున్న వారినీ ఆప్యాయంగా పలకరించి వారితో ముచ్చటించారు. స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పిల్లలకు క్రీడ సామగ్రి ఇప్పిస్తానన్నారు. ఇండోర్ స్టేడియంలో పైకప్పు రేకులు ఊడిపోవడంతో కొత్తవి ఏర్పాటు చేస్తానన్నారు. వాకింగ్ ట్రాక్ కు మట్టి పోపిస్తానన్నారు. పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.