Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించు చీఫ్ మినిస్టర్స్ కప్ 2023 క్రీడా పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుషఉ్బ గుప్తా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో చీఫ్ మినిస్టర్స్ కప్ 2023 క్రీడా పోటీల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి లో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు,వివిధ శాఖల అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సమీక్షించి సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో క్రిడాకారులలో ప్రతిభను వెలికి తీసేందుకు ఈ నెల 15 నుండి పురుషులు,మహిళలకు నిర్వహించే ఈ క్రీడా పోటిలను విజయవంతం చేసేందుకు జిల్లా, మండల స్థాయి ఏర్పాటు చేసిన కమిటీలు అన్నీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 15 నుండి 17వ తేది వరకు మండల స్థాయి పోటీలు, ఈ నెల 22 నుండి 24 వ తేది వరకు జిల్లా స్థాయి పోటీలు, ఈ నెల 28 నుండి 31 వరకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. మండల స్థాయి లో ఖోఖో, అధ్లెటిక్స్, వాలిబాల్ కబడ్డి,పుట్ బాల్ 5 క్రీడలలో, జిల్లా స్థాయిలో ఖోఖో, అధ్లెటిక్స్, వాలిబాల్ కబడ్డి,పుట్ బాల్ ,బ్యాడ్మింటన్,బాస్కెట్ బాల్,బాక్సింగ్,హ్యాండ్ బాల్,స్విమ్మింగ్,రెజ్లింగ్ వంటి11 క్రీడలలో, రాష్ట్ర స్థాయిలో18 క్రీడలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయి కమిటీ లో చైర్మన్ గా ఎంపీపీ సభ్యులు గా జడ్పిటిసి, తహశీల్దార్,ఎంఈ ఓ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్,పిడి, పిఈటి లు, సభ్యులుగా, ఎంపిడి ఓ లు కన్వీనర్ గా ఉంటారని తెలిపారు.జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మెన్ గా, జిల్లా ఎస్పి, వైస్చైర్మెన్ గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కో వైస్ చైర్మెన్ గా, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ కన్వీనర్ గా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు,కార్యదర్శి గా జిల్లా విద్యాధికారి, పరిశ్రమల శాఖ జి.యం, మున్సిపల్ కమిషనర్,జడ్పి సిఈఓ, గృహ నిర్మాణ శాఖ పిడి, డిపిఅర్ఓ సభ్యులుగా ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో క్రీడాకారులను గుర్తించి గెలుపొందిన వారిని జిల్లాస్థాయికి పంపించాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఆడి గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఆడి గెలుపొందిన వారిని వ్యక్తిగత , జట్టు గా పరిగణించి బంగారు , రజత, కాంస్య మూడు పథకాలు, నగదు బహుమతులను ప్రదానం చేస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి మండలం లోని అధికారులకు అవగాహన కలిగించేలా ఎంపీడీఓలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి వివరించాలని జడ్పి సిఈఓ కు సూచించారు.ఈ సమావేశం లో జడ్పి సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జియం. కోటేశ్వర్ రావు,డిపిఅర్ఓ. శ్రీనివాస్,గృహ నిర్మాణ శాఖ పిడి.రాజ్ కుమార్, జిల్లా యువజన,క్రీడల అధికారి మక్బూల్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.